ఫ్యాన్స్‌ అత్యుత్సాహం, న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో నటుడికి గాయం | Gurmeet Choudhary Injured While Protecting Debina Bonnerjee, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Gurmeet Choudhary: ఈవెంట్‌లో బుల్లితెర నటుడికి గాయం, వీడియో వైరల్‌

Published Mon, Jan 2 2023 12:28 PM | Last Updated on Mon, Jan 2 2023 12:41 PM

Gurmeet Choudhary Injured While Protecting Debina Bonnerjee, Video Goes Viral - Sakshi

సినిమాలు, సీరియల్స్‌లో కనిపించే తారలు కళ్లముందుకొస్తే ఎలా ఉటుంది? ఒక్క సెల్ఫీ ప్లీజ్‌.. అంటూ అభిమానులు ఎగబడుతారు. ఎలాగైనా ఫోటో దిగాలన్న ఆరాటంలో ఒకర్నొకరు తోసుకుంటూ మురీ ముందుకొస్తారు. ఈ క్రమంలో నటీనటులు ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో! తాజాగా బాలీవుడ్‌ బుల్లితెర జంట గుర్మీత్‌ చౌదరి- దెబీనా బెనర్జీ కొత్త సంవత్సర వేడుకలో పాల్గొన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన ఫ్యాన్స్‌ ఫోటోల కోసం ఎగబడ్డారు. వారిని ఆపలేక అష్టకష్టాలు పడ్డాడు గుర్మీత్‌. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది. దీంతో వారిద్దరూ ఆ ఈవెంట్‌ నుంచి వెంటనే వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన గుర్మీత్‌ నిజంగానే మంచి భర్త అని పొగుడుతుంటే మరికొందరు మాత్రం 'అమ్మో, ఎంత పెద్ద దెబ్బలు తాకాయో, వెంటనే అంబులెన్స్‌లో తీసుకెళ్లండి', 'ఐదేళ్ల పిల్లాడు కూడా ఆ దెబ్బలను చూపించి షో చేయడు' అని సెటైర్లు వేస్తున్నారు. కాగా గుర్మీత్‌, దెబీనా రామాయణ్‌(2008) సీరియల్‌లో రాముడు, సీతగా నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ ఏడాది ఏప్రిల్‌, నవంబర్‌లలో ఇద్దరు కూతుర్లు జన్మించారు.

చదవండి: ఆయనతో నటించాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన త్రిష
నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement