‘ఆ హీరోయిన్‌ మోసం చేసింది’ | Fraud Case Debina Bonnerjee and Gurmeet Condemns | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 11:13 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Fraud Case Debina Bonnerjee and Gurmeet Condemns - Sakshi

గుర్మీత్‌ చౌదరి-డెబీనా బెనర్జీ

సాక్షి, సినిమా: సినిమా ఛాన్స్‌ల పేరిట మోసం చేస్తున్న కేసులో సెలబ్రిటీ జంటపై కేసు నమోదు అయ్యింది. బాలీవుడ్‌ కపుల్‌ గుర్మీత్‌ చౌదరి-డెబీనా బెనర్జీలు అవకాశాల పేరుతో మోసం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వ్యవహారంలో తమ ప్రమేయం లేదంటూ ఆ దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు.  

వివరాల్లో​కి వెళ్తే... బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ డెబ్లీనా ఓ వ్యక్తికి ఆఫర్‌ ఇచ్చింది. ఇందుకుగానూ కొంత డబ్బు చెల్లించాలని అతన్ని కోరింది. దీంతో అతను రూ.11 లక్షలు వారికి సమర్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాల గురించి ఆరా తీయగా వారి నుంచి స్పందన కరువైంది. దీంతో నొఖా పోలీస్ స్టేషన్(రాజస్థాన్‌) లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు డెబీనా, గుర్మీత్‌లకు నోటీసులు పంపించారు. 

గుర్మీత్‌ ప్రకటన... మీడియాలో వస్తున్న కథనాలపై గుర్మీత్‌-డెబీనాలు ఓ ప్రకటనను విడుదల చేశారు. తాము ఎలాంటి మోసానికి పాల్పడలేదని, అనవసరంగా ఈ వ్యవహారంలోకి తమను లాగుతున్నారని వారు పేర్కొన్నారు. మరోవైపు దెబీనా కూడా అతనెవరో తెలీదంటూ మీడియాకు వివరించింది. సదరు వ్యక్తిపై ముంబై పోలీసులకు గుర్మీత్‌ ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీసులు మాత్రం ఈ రెండు కేసులను దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని అంటున్నారు. అమ్మాయిలు-అబ్బాయిలు చిత్రం ద్వారా డెబీనా బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే, నటుడు గుర్మీత్‌ చౌదరిని వివాహం చేసుకుని ఆపై నటనకు ఆమె విరామం​ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement