బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ శరద్‌పై 32 ఏళ్ల మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలంటూ తన ఆఫీస్‌కి ఆహ్వానించి.. అసభ్యకరంగా తాకాడని, లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదుతో ముంబై పోలీసులు శరద్ కపూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రీల్స్ గురించి చర్చించాలంటూ నవంబర్ 26న సదరు మహిళను శరద్ తన ఆఫీస్‌కి ఆహ్వానించాడు. ఆమె ఆఫీస్‌కి వెళ్లగానే అక్కడి సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లమని చెప్పారు. ఆమె అతని దగ్గరకు వెళ్లగానే బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై శరద్ కపూర్ ఇంతవరకు స్పందించలేదు.
శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తన కెరీర్‌లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ రోషన్ ‘లక్ష’ సినిమాలో శరద్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment