కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్‌ | Gangster Lawrence Bishnoi Warning To Salman Khan After Firing At Actor's Mumbai House, See Details Inside - Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్‌.. ఆ గ్యాంగ్‌తో గొడవేంటి?

Published Sun, Apr 14 2024 7:32 PM | Last Updated on Mon, Apr 15 2024 12:10 PM

Gangster Lawrence Bishnoi Warning To Salman Khan - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్‌ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌  వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ ​సైకిల్​ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై  ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు  వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంతలోపు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్‌బుక్‌​ అకౌంట్​ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్​ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్‌ రీచ్‌ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక ‍స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్​ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్‌ ద్వారా ఆయనకు వార్నింగ్‌ ఇచ్చారు.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌తో గొడవేంటి..?
ఈ గ్యాంగ్‌స్టర్స్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా  బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్‌ దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్‌ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్‌ ఢిల్లీ జైలులో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement