
మహారాష్ట్రకు చెందిన అదితి పోహంకర్.. షీ,ఆశ్రమం అనే వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయింది. ఆపై క్యాడ్‌బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్‌టెల్, లెన్స్‌కార్ట్, శామ్‌సంగ్‌తో సహా ఇరవైకి పైగా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో నటించింది. ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2020లో 47వ ర్యాంక్‌ని పొందింది. అయితే, తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
ఒకరోజు తన అమ్మతో స్కూల్‌కు వెళ్తుండగా జరిగిన సంఘటనను ఆదితి పోహంకర్ ఇలా చెప్పింది. 'అమ్మ, సీఏఐసీడబ్ల్యూఏ టీచర్‌గా ఉన్నప్పుడు.. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇద్దరం కలిసి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీట్ లేకపోవడంతో నేను నిల్చోనే ఉన్నాను. ఆ సమయంలో అతను నాపై చేయి వేయడం గమనించాను. వెంటనే అమ్మతో చెప్పాను. అతను భయంతో వెళ్తున్న క్రమంలో నన్ను బలంగా పక్కకు లాగేశాడు. దీంతో నేను కింద పడిపోయాను. ఆ గాయం ఇప్పటికీ ఉంది.' అని చెప్పింది.

'నేను సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముంబై రైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేను లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నాను. కానీ, అందులో 18 ఏళ్ల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైనా సరే ప్రయాణించవచ్చని నిబంధన ఉంది. ఆ రోజు 17 ఏళ్ల విద్యార్థి అకస్మాత్తుగా నా ఛాతీని బలంగా టచ్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. నేను గట్టిగా అరిచిన కూడా అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు. అప్పుడు మరోస్టాప్ రాగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇంతలో ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. పోలీసులు పట్టించుకోలేదని వారిని నిలదీశాను. దీంతో తిరిగి నాపైనే కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అతను మీపై చేయి వేశాడని రుజువు ఏంటి అంటూ ప్రశ్నించారు. కానీ, అంత చిన్న వయసులోనే వాడి చెడు ఆలోచన నన్ను బాగా కలిచివేసింది.' అని ఆమె గుర్తుచేసుకుంది.
షీ వెబ్ సిరీస్‌లో కానిస్టేబుల్ భూమిగా నటించిన అదితి, బోహంకర్ నాయక్ అనే డ్రగ్ కింగ్‌పిన్‌ను పట్టుకోవడానికి రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రహస్యంగా వెళ్తుంది. ఈ సిరీస్‌లో ఆమె చాలావరకు మితిమీరిన గ్లామర్ పాత్రలోనే కనిపిస్తుంది. విజయ్ వర్మతో కొన్ని ఇంటిమేట్ సీన్లు కూడా చేస్తుంది. బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో కూడా ఆమె చాలా రొమాన్స్ సన్నివేశాలలో నటించింది. అశ్లీల సన్నివేశాల్లో నటించాలంటే నటీమణుల కంటే నటులే ఎక్కువ భయపడతారని ఆమె చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment