She
-
17 ఏళ్లకే వాడిలో అలాంటి ఆలోచనలా: అదితి
మహారాష్ట్రకు చెందిన అదితి పోహంకర్.. షీ,ఆశ్రమం అనే వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయింది. ఆపై క్యాడ్బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్టెల్, లెన్స్‌కార్ట్, శామ్సంగ్తో సహా ఇరవైకి పైగా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో నటించింది. ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2020లో 47వ ర్యాంక్‌ని పొందింది. అయితే, తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.ఒకరోజు తన అమ్మతో స్కూల్‌కు వెళ్తుండగా జరిగిన సంఘటనను ఆదితి పోహంకర్ ఇలా చెప్పింది. 'అమ్మ, సీఏఐసీడబ్ల్యూఏ టీచర్‌గా ఉన్నప్పుడు.. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇద్దరం కలిసి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీట్ లేకపోవడంతో నేను నిల్చోనే ఉన్నాను. ఆ సమయంలో అతను నాపై చేయి వేయడం గమనించాను. వెంటనే అమ్మతో చెప్పాను. అతను భయంతో వెళ్తున్న క్రమంలో నన్ను బలంగా పక్కకు లాగేశాడు. దీంతో నేను కింద పడిపోయాను. ఆ గాయం ఇప్పటికీ ఉంది.' అని చెప్పింది.'నేను సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముంబై రైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేను లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాను. కానీ, అందులో 18 ఏళ్ల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైనా సరే ప్రయాణించవచ్చని నిబంధన ఉంది. ఆ రోజు 17 ఏళ్ల విద్యార్థి అకస్మాత్తుగా నా ఛాతీని బలంగా టచ్ చేశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. నేను గట్టిగా అరిచిన కూడా అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు. అప్పుడు మరోస్టాప్ రాగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇంతలో ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. పోలీసులు పట్టించుకోలేదని వారిని నిలదీశాను. దీంతో తిరిగి నాపైనే కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అతను మీపై చేయి వేశాడని రుజువు ఏంటి అంటూ ప్రశ్నించారు. కానీ, అంత చిన్న వయసులోనే వాడి చెడు ఆలోచన నన్ను బాగా కలిచివేసింది.' అని ఆమె గుర్తుచేసుకుంది.షీ వెబ్ సిరీస్‌లో కానిస్టేబుల్ భూమిగా నటించిన అదితి, బోహంకర్ నాయక్ అనే డ్రగ్ కింగ్‌పిన్‌ను పట్టుకోవడానికి రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రహస్యంగా వెళ్తుంది. ఈ సిరీస్‌లో ఆమె చాలావరకు మితిమీరిన గ్లామర్ పాత్రలోనే కనిపిస్తుంది. విజయ్ వర్మతో కొన్ని ఇంటిమేట్ సీన్లు కూడా చేస్తుంది. బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో కూడా ఆమె చాలా రొమాన్స్ సన్నివేశాలలో నటించింది. అశ్లీల సన్నివేశాల్లో నటించాలంటే నటీమణుల కంటే నటులే ఎక్కువ భయపడతారని ఆమె చెప్పుకొచ్చింది. -
హైదరాబాద్‌లో ఇదేం విచిత్రం.. షీ టాయిలెట్లలో షాపులా?
సాక్షి, రామంతాపూర్: వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చే నగర మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షీ టాయిలెట్ల ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ అగమ్యగోచరంగా తయారవడం మహిళల పాలిట శాపంలా తయారవుతోంది. వివరాలివీ... రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఐడీఏ ఉప్పల్ సమీపంలో మోడ్రన్ బేకరీ ఎదురుగా ఉన్న బస్టాండ్ ఆనుకొని షీ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ షీ టాయిలెట్లను బస్సుల కోసం ఎదురు చూసే మహిళలతో పాటు స్థానికంగా ఉన్న ఐడీఏ ఉప్పల్‌లో పలు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు వినియోగిస్తుంటారు. అయితే షీ టాయిలెట్ అని చూడకుంగా వీటిని ఆనుకొని షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపులను పురుషులే నిర్వహిస్తున్నందున చాలామంది మహిళలు షీ టాయిలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ టాయిలెట్లను ఆనుకొని ఉన్న షాపులను దూరంగా తరలించాలని లేదా ఈ షీ టాయిలెట్‌ను మహిళలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
కఠోర శ్రమతోనే విజయం సాధ్యం
ఒలింపిక్ మెడల్ విజేత సింధు వైభవంగా షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవం తాడితోట/(రాజమహేంద్రవరం సిటీ) : కఠోర శ్రమతోనే విజయం సాధ్యమని ప్రముఖ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు అన్నారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీ టీమ్ సభ్యులు వాట్సప్, మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై క్షణాలలో రక్షణ కల్పించడం అభినందనీయమని కితాబు ఇచ్చారు. షీ టీమ్ వల్ల మహిళలకు భద్రత, రక్షణ కలుగుతుందని, ఈ టీమ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సూచించారు. యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ పీవీ సింధును స్ఫూర్తిగా తీసుకొని యువత విజయం సాధించాలని యువతకు సూచించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించిన చోటే దేవతలు ఉంటారన్న ఆరోక్తిని ప్రస్తావించారు. మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టాలనే లక్ష్యంతో షీ టీమ్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో సుమారు మూడు వేలకు పైగా యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. షీ టీమ్ ఏర్పాటుతో నగరంలోని మహిళలకు భరోసా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా షీ టీమ్ తరఫున యాప్‌ను ప్రారంభించారు. పిల్లలపై బాధ్యతగా వ్యవహరించాలి... సింధు తండ్రి రమణ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు. తాము బాధ్యతగా వ్యవహరించడం వల్లే సింధు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిందని అన్నారు. తొలుత సింధును మధురపూడి విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆనం కళాకేంద్రానికి తీసుకువచ్చారు. షీ టీమ్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలు, షటిల్ బ్యాడ్మింటెన్ పోటీలలో విజేతలకు సింధూ బహుమతులు అందజేశారు. సింధుకు ఘన సత్కారం ఈ సందర్భంగా సింధూను ఘనంగా సత్కరించారు. షీ టీమ్ సభ్యులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిరి ఆనంద్, ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంఓ పద్మశ్రీ,, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మ, భవాని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఆదిరెడ్డి భవాని, బి.సత్యకుమారి, ఆర్.చంద్రకళ, అడిషినల్ ఎస్పీలు ఆర్.గంగాధరరావు, రజనీకాంత్‌రెడ్డి, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, వైవీ రమణరావు, సీఐలు రవీంద్ర, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్‌తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
శ్మశానంలో 'షి'
హైదరాబాద్: విలక్షణ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె హీరోయిన్గా నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని ఉత్తేజ్ సోమవారం సోషల్ మీడియాలో అఫీయల్గా ప్రకటించారు. షీ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. ఆ విశేషాలను, ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. మలయాళ కుట్టి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో ఉత్తేజ్ కూతురు చేతన టాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ''షీ''. 'ఈజ్ వెయిటింగ్' అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా కొన్ని దృశ్యాలను శ్మశానంలో చిత్రీకరించారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు సోదరి రమ్య క్లాప్ కొట్టగా , అనూప్ సింగ్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. తాను ఇంతకు ముందు బాలనటిగా నటించినా, హీరోయిన్గా మాత్రం ఇదే తొలి సినిమా అని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని చేతన మీడియాతో చెప్పారు. మరి ఈమె కూడా తండ్రిలాగే విలక్షణ నటనతో ఆకట్టుకుంటుందా.. హీరోయిన్గా రాణిస్తుందా అనేది తెలియాలంటే షీ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. -
శ్వేతామీనన్ నిరీక్షణ
హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. శ్వేతామీనన్ ముఖ్య పాత్రలో పర్స రమేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బసంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: అనిత్, సంగీతం: భోలే. -
షీ ఈజ్ వెయిటింగ్
మలయాళ నటి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో పర్స మహేశ్ దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ిహీరో, ఇతర తారాగణం. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. -
షీ టీమ్స్ రెడీ
మహిళల భద్రతకు ప్రత్యేక బృందాలు కళాశాలలు.. గ్రామాలు.. పట్టణాల్లో నిఘా జిల్లాలో 59 మంది పోలీసులతో ఏర్పాటు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడి 'రాగిణి.. మదనపల్లెలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ప్రతీ రోజూ ఓ ఆకతాయి బస్టాపు వద్దకు వచ్చి వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనని భయంతో మౌనం వహిస్తోంది. ఈ తతంగాన్ని బస్టాపు వద్ద చుడిదార్ ధరించిన ఇద్దరు మహిళా పోలీసులు చూసి పట్టుకుని తాటతీసి స్టేషన్‌కు తరలించి, ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తారని అతనికి తెలియదు పాపం..' "కీర్తన ఓ సాధారణ గృహిణి. చిత్తూరు నగరంలో ఉంటోంది. భర్త ఇంట్లో లేని సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్. అసభ్య మెసేజ్‌లు వస్తున్నాయి. ఫోన్ రింగయితే భయపడిపోతోంది. ‘షీ’ టీమ్స్ గురించి విన్న ఈమె తన వివరాలు చెప్పొద్దని నిందితుడి భరతం పట్టాలని పోలీసులను కోరింది. గంటలో పోలీసులు ఆ పోకిరిని పట్టుకుని కటకటాల్లోకి నెడుతారు." షీ టీమ్‌ల ఏర్పాటుతో మహిళలకు ఈ తరహా భద్రత కల్పించేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. షీ... అంటే ఆమె. స్త్రీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలను అరికట్టడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. జంటనగరాల్లో అమలవుతున్న ‘షీ’ టీమ్స్‌ను జిల్లాలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వద్ద దీన్ని ప్రాంరభించారు. మొత్తం 59 మందితో తొలి దశగా ఈ బృందాలను ప్రజల మధ్యలో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సైతం మహిళల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని కోరారు. త్వరలో కమ్యూనిటీ పోలీస్ పేరిట ట్రాఫిక్, బందోబస్తు, ఇతర సేవల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు గిరిధరరావు, రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, రమణయ్య, దేవదాసులు, సీఐలు సూర్యమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు ప్రాంతాల్లో షీ టీమ్స్ ఏర్పాటు తొలి ప్రయత్నంగా జిల్లాలోని ఐదు చోట్ల ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరులో 16 మంది, పలమనేరులో 11 మంది, మదనపల్లెలో 15 మంది, కుప్పంలో ఆరుగురు, పుత్తూరులో 11 మందితో మహిళా భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, కళాశాలల కూడళ్లు, బస్టాపుల్లో బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతుంటారు. ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అంతేగాక భార్య, భర్తల మధ్య గొడవలను తీర్చడం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇరువురికీ అవగాహన కల్పించడం చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళా భద్రత కమిటీలు పనిచేస్తాయి. రానున్న ఆరు నెలల కాలంలో జిల్లాలోని అన్ని పట్టణాలు, నగరాలు, మేజర్ పంచాయతీల్లో ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడానికి ఇదొక ప్రయత్నంగా పోలీసుశాఖ భావిస్తోంది. ఇందులో వచ్చే లోటుపాట్లు సరిదిద్దుకుని భవిష్యత్తులో ఏర్పాటు చేసే కమిటీల్లో వాటిని సరిచేసుకుంటారు. -
ఆమే.. అతడైయాడు !