స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటిస్తా | Would love to go naked for a film: Gurmeet | Sakshi
Sakshi News home page

స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటిస్తా

Published Sat, Nov 19 2016 7:28 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటిస్తా - Sakshi

స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటిస్తా

ముంబై: కథ డిమాండ్‌ చేస్తే అందాలు ఆరబోసేందుకు రెడీ అంటూ హీరోయిన్లు చెబుతుంటారు. అలాగే బాలీవుడ్ నటుడు గుర్మీత్‌ చౌదరి కూడా ఇదే మాట చెప్పాడు. స్క్రిప్ట్ డిమాండ్‌ చేస్తే తాను నగ్నంగా నటిస్తానని అన్నాడు.

'నేను చేసే పాత్రలన్నింటిలో వందశాతం అత్యుత్తమంగా నటించాలని భావిస్తా. నేను అంకితభావం గల నటుడ్ని. ఓ పాత్ర కోసం నగ్నంగా నటించాలని కథ డిమాండ్ చేస్తే అలాగే చేస్తా. రాజ్కుమార్‌ హిరానీ పిలిచి నీకు తగిన పాత్ర ఉంది.. నగ్నంగా పరిగెత్తు అని చెబితే అలాగే చేస్తాను' అని గుర్మీత్‌ చెప్పాడు. అతను నటించిన వాజా తుమ్‌ హో సినిమాలో హాట్‌ సన్నివేశాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో అసభ్యకర దృశ్యాలు లేవని, ప్రేమ సన్నివేశాలని గుర్మీత్‌ చెప్పాడు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement