బనశంకరి: తరచూ భార్య, అత్త పై ప్రాణాంతక దాడికి పాల్పడిన సైకో భర్తని ఆదివారం కుమారస్వామి లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుడు ఆసిఫ్. బనశంకరి సరబండెపాళ్యలోని పుట్టింటిలో భార్య హీనా కౌసర్ ఉంటోంది. 14వ తేదీన వెళ్లిన ఆసిఫ్ గొడవపెట్టుకుని భార్య, అత్త పరీ్వన్‌తాజ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
ఆసిఫ్, హీనాకు 10ఏళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఆసిఫ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. హీనా కౌసర్ మరో వ్యక్తికి మెసేజ్ చేసిందని గమనించి అనుమానంతో ఆమెను కొట్టి 8 నెలలు క్రితం పుట్టింట్లో వదిలిపెట్టివెళ్లాడు. తరువాత కూడా మూడుసార్లు దాడిచేశాడు. తాజా దాడిలో మహిళలలిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, చుట్టుపక్కల వారు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆదివారం ఆసిఫ్‌ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment