షిర్డీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం | Spicejet Plane Overshoots Runway on Landing at Shirdi | Sakshi
Sakshi News home page

షిర్డీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం

Published Mon, Apr 29 2019 6:10 PM | Last Updated on Mon, Apr 29 2019 6:15 PM

Spicejet Plane Overshoots Runway on Landing at Shirdi - Sakshi

ఫైల్‌ ఫోటో


సాక్షి, ముంబై: స్పైస్‌జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. షిర్డీ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్  సందర్భంగా రన్‌వే పై స్కిడ్‌ అయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఢిల్లీనుంచి షిర్డీకి వస్తున్న సమయంలో సోమవారం  సాయంత్రం  ఈ ఘటన చోటుచేసుకుంది. 

స్పైస్‌ జెట్‌ విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో రన్‌వే మీదనుంచి జారిపోయింది. దాదాపు 30నుంచి 20 మీటర్ల దూరం దూసుకుపోయింది. దీంతో యాత్రికుల తాకిడి అధికంగా వుండే విమానాశ్రయంలో కార్యకలాపాలు  కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం ఉదంతాన్ని స్పైస్‌ జెట్‌ ప్రతినిధి నిర్ధారించారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement