
విమానానికి సాంకేతిక సమస్య
మాజీ మంత్రి బొత్స సహా 200 మంది ప్రయాణికులు 2 గంటలు విమానంలోనే..
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఓ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు గంటల పాటు విమానం అప్రాన్‌పై నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు స్పైస్ జెట్ విమానం ఉదయం 8.50కి వచ్చి తిరిగి 9.20కి బయలుదేరేందుకు సిద్ధమైంది.
ఇంతలో హఠాత్తుగా ఇంజన్‌లో సమస్య ఎదురవడంతో సాంకేతిక నిపుణులు హుటాహుటిన స్పందించి చర్యలు చేపట్టారు. 11.20కి సాంకేతిక సమస్య పరిష్కరిం చడంతో విమానం హైదరాబాద్‌కు కదిలింది. ఇందులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అగ్ర నేత బొత్స సత్యనారాయణతో పాటు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్‌లో లోపం వల్ల అసౌకర్యం ఎదుర్కొన్నామని, ఎలాంటి ఇబ్బందీ లేదని బొత్స తెలిపారు.