
రాయ్‌పూర్: కోల్‌కతాకు చెందిన ఓ ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. బయలుదేరిన కాసేపటికే విమానం తిరిగి ఎమర్జెన్సీల్యాండ్ అవడంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. పక్షి ఢీకొట్టిన కారణంగా విమానాన్ని దింపివేసినట్లు అధికారులు చెప్పారు. ఆ సమయంలో విమానంలో 150మంది ఉన్నారు.
ఇండిగో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో రాయ్‌పూర్ నుంచి కోల్‌కతాకు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే, మధ్యలో దానికి పక్షి ఢీకొట్టడంతో వెంటనే స్వామీ వివేకానంద ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. పక్షి బలంగా ఢీకొట్టడంతోనే విమానం దింపివేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత విమాన ఇంజిన్‌కు తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ప్రయాణీకులను వేరే విమానాల ద్వారా వారి ప్రాంతాలకు తరలించారు.