విమానంలో లైంగిక వేధింపులు.. నేత అరెస్ట్ | BJP leader arrested for molesting minor girl on board IndiGo flight | Sakshi
Sakshi News home page

విమానంలో లైంగిక వేధింపులు.. నేత అరెస్ట్

Published Tue, May 31 2016 4:11 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

విమానంలో లైంగిక వేధింపులు.. నేత అరెస్ట్ - Sakshi

విమానంలో లైంగిక వేధింపులు.. నేత అరెస్ట్

గాంధీనగర్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బీజేపీ నేత అరెస్టయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బీజేపీ నేత అశోక్ మక్వానాను సర్ధార్ నగర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ లైన్స్ వారి నుంచి కొన్ని డాక్యుమెంట్లను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

మూడు రోజుల కిందట బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో ఓ బాలిక(13) గోవాలోని తన అంకుల్ ఇంటికి వెళ్లింది. మే 28న ఇండిగో విమానంలో ఇంటికి తిరుగు ప్రయాణమైంది. మక్వానా ఆ బాలిక పక్క సీట్లో కూర్చుని ట్రావెల్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్యంగా ప్రవర్తించారు.

ఇంటికి చేరుకున్న బాలిక, విమాన ప్రయాణంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని పేరేంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. వ్యాపారవేత్త అయిన బాలిక తండ్రి తమకు ఫిర్యాదు ఇచ్చాడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి బీడీ పాటిల్ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అశోక్ మక్వానాను అరెస్ట్ చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement