ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | IndiGo flight makes emergency landing at Visakha airport | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Published Wed, Aug 30 2017 10:26 AM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM

IndiGo flight makes emergency landing at Visakha airport

సాక్షి, విశాఖ : విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి  ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. కాగా ఫ్లయిట్‌ టేకాఫ్‌ సమయంలో ఓ పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్‌ అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించివేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement