ముంబై విమానాశ్రయంలో హైదరాబాద్ విమానానికి భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికుడొకరు 'సాక్షి'కి తెలిపారు.
ముంబై విమానాశ్రయంలో హైదరాబాద్ విమానానికి భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికుడొకరు 'సాక్షి'కి తెలిపారు. 6E 254 నంబరు గల ఇండిగో విమానంకు ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా మరో విమానం దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని పక్కకు తప్పించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాద సమయంలో ఇండిగో విమానంలో 95 మంది ప్రయాణికులున్నారు. నావిగేషన్‌లో సమస్యలు తలెత్తడం వల్లే రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయని గుర్తించారు. మరొక విమానం ద్వారా ప్రయాణికుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.