ముంబై : టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడుల్లో రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాతో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ సహా మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వెంటనే వారిని బెయిల్‌పై విడుదల చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు.(చదవండి : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇంటికి వచ్చి)
కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసి కేసు నమోదు చేశామని.. వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ తెలిపింది. అనంతరం నిందితులను బెయిల్‌పై విడుదల చేశారు. క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 34 మందిపై ఐపిసి సెక్షన్ 188, 269, 34, ఎన్‌ఎండిఎ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంతో పాటు ముంబైలో డిసెంబర్ 22 నుండి జనవరి 5 వరకు ప్రజా కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : బ్రాడ్‌మన్ క్యాప్‌కు అరుదైన గౌరవం)
Comments
Please login to add a commentAdd a comment