పైలెట్‌ లేక 250 మంది ప్రయాణీకుల నిరీక్షణ.! | Over 250 Passengers Left Stranded at Mumbai Airport as Air India Flight Gets Delayed | Sakshi
Sakshi News home page

పైలెట్‌ లేక 250 మంది ప్రయాణీకుల నిరీక్షణ.!

Published Sat, Dec 2 2017 3:07 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Over 250 Passengers Left Stranded at Mumbai Airport as Air India Flight Gets Delayed - Sakshi

ముంబై :  పైలెట్‌ గైర్హాజరుతో 250 మంది ప్రయాణీకులు చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలో సుమారు 7 గంటలు నిరీక్షించారు. ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఏయిర్‌ ఇండియా విమానం ఉదయం 1.30 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణీకులంతా ఆగ్రహానికి గురయ్యారు. తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు ఉదయం 9 గంటల సమయంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది.

ఈ విషయంపై ఏయిర్‌ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్‌ ట్రైన్‌డ్‌ పైలెట్‌ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్‌ను సద్దుబాటు చేసి 8.30 విమానం టేకాఫ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement