
విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు
ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.