మహిళపై అత్యాచారం.. న్యూడ్‌ వీడియోలతో పైశాచికత్వం | Kerala: CPI(M) Member Arrested For Circulating Nude Video Of Party Worker | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం.. న్యూడ్‌ వీడియోలతో పైశాచికత్వం

Published Thu, Dec 2 2021 8:10 PM | Last Updated on Thu, Dec 2 2021 9:18 PM

Kerala: CPI(M) Member Arrested For Circulating Nude Video Of Party Worker  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీ స్థానిక నేత.. మహిళా కార్యకర్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత మేనెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిరువల్ల పరిధిలోని స్థానిక నేత.. సజిమోన్‌ తన కార్యాలయంలో బాధిత మహిళకు కూల్‌డ్రింక్‌లో మత్తు పానీయాన్ని  కలిపి తాగించారు.

ఆ తర్వాత.. ఆమెను కారులో బలవంతంగా ఎక్కించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఆమెను వివస్త్రను, వీడియోలు తీశారు. ఈ దారుణంలో 12 మంది నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు..  బాధిత మహిళా న్యూడ్‌ వీడియోలు తీసి వేధించడమే కాకుండా డబ్బులివ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి మహిళా ఒప్పుకోకపోవడంతో ఆమె న్యూడ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

ఈ క్రమంలో.. బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సజిమోన్‌, నాసర్‌ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో 10 నిందితుల కోసం​ గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు దర్యాప్తులో  అలసత్వం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు తీవ్ర విమర్షలు చేస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement