నలుగురు మత్స్యకారుల గల్లంతు | Four Fishermen Missing In Sea At East Godavari | Sakshi
Sakshi News home page

నలుగురు మత్స్యకారుల గల్లంతు

Aug 14 2020 11:04 AM | Updated on Aug 14 2020 11:13 AM

Four Fishermen Missing In Sea At East Godavari - Sakshi

సాక్షి, కాకినాడ: బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో చోటుచేసుకుంది. ఈ నెల 11న ఉప్పాడ శివారు అమీనాబాద్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భైరవపాలెం వద్ద బోటు ఇంజన్‌ పాడైనట్లు తమ వారికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ పనిచేయలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఇండియన్ కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement