న్యూఢిల్లీ: భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్ మార్చి 2022 నాటికి వినియోగంలోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. అరేబియన్ సముద్రంలో రామేశ్వర ద్వీపంలోని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ దాదాపు 2 కి.మీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉన్న 104 ఏళ్ల నాటి వంతెన స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన పైకి లెగిసే వంతెనను ఏర్పాటు చేశారు.
ఇది ఏవైనా చిన్నచిన్న షిప్‌లు వచ్చినప్పుడూ ఆటోమేటిక్‌గా ఆ వంతెన పైకి లెగిసి వాటికి దారి ఇస్తుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి కూ యాప్‌లో కొత్త పంబన్ వంతెన ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని "ఈ డ్యూయల్-ట్రాక్ అత్యాధునిక వంతెన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment