![Man Saves Tiny Little Bird From Drowning In The Sea Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/31/bird.gif.webp?itok=koiOZCLO)
న్యూఢిల్లీ: సముద్రంలో మునిగిపోకుండా చిన్న పక్షిని ఓ వ్యక్తి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంగ్లాండ్‌కు చెందిన సైమన్ బీఆర్‌ఎఫ్సీ హాప్కిన్స్ అనే సంస్థ తన ట్విటర్ పేజీలో ‘ప్రపంచానికి ఇంకా ఇలాంటి వ్యక్తులు కావాలి’ అనే క్యాప్షన్‌కు రెండ్ హార్ట్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేసింది. సముద్రం మధ్యలో నీటిపై కొట్టుకుంటున్న ఆ పక్షిని కాపాడటమే కాకుండా దానికి ఆహారం పెట్టిన అతడిపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు)
‘ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది’, ‘అందమై వ్యక్తి, పక్షి’, ‘అవును.. ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు అవసరం’ అంటూ నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బోటులో సుముద్ర పర్యటనకు వెళ్లిన వ్యక్తి సాగరం మధ్యలో ఆ పక్షి నీటిపై కొట్టుకోవడం గమనించాడు. వెంటనే ఆ వ్యక్తి పక్షిని తన చేతుల్లోకి తీసుకుని పడవలో దించాడు. నీటి తేమ లేకుండా ఆరబెట్టి, దానికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత నీటిని తాగించి ఆ పక్షితో కాసేపు సరదాగా ఆడుకున్నాడు. ఇక ఒడ్డు దగ్గరికి చేరుకోగానే ఆ పక్షిని ఆకాశంలోకి వదిలాడు. (చదవండి: అనుకోని అతిథి.. ఎక్కడివారక్కడే గప్‌చుప్)
Comments
Please login to add a commentAdd a comment