Why Sea Cucumbers Are So Expensive in International Market - Sakshi
Sakshi News home page

Sea Cucumbers Price: ఈ సముద్ర దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?

Published Sun, Dec 12 2021 2:57 PM | Last Updated on Sun, Dec 12 2021 5:26 PM

Why Sea Cucumbers Are So Expensive - Sakshi

సాదారణంగా మన ఊరిలో దోసకాయ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.50 - రూ.100 మధ్య ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దోసకాయ ఖరీదు ఎంతో తెలిస్తే!.. షాక్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సముద్ర దోసకాయ ఖరీదు అక్షరాల రూ.2 లక్షల పైనే ఉంటుంది. మరి, ఇవి ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?. ఈ సముద్ర దోసకాయలు ఎక్కువగా దొరకవు. వీటిని పట్టుకోవడం కోసం కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే, ఈ సముద్ర దోసకాయలు చాలా ప్రత్యేకమైన జీవులు. 

చికిత్స కోసం...
వీటికి ఎలాంటి అవయవాలు ఉండవు. కేవలం, నోరు మాత్రమే ఉంటుంది. ఈ జీవులకు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువ సంపన్న వర్గ కుటుంబాలు వీటిని ఆహారంగ స్వీకరిస్తారు. ప్రపంచంలోని 1,250 విభిన్న జాతుల సముద్ర దోసకాయలో జపనీస్ సముద్ర దోసకాయ చాలా ప్రత్యేకమైనది. గోల్డెన్ శాండ్ ఫిష్, డ్రాగన్ ఫిష్, కర్రీ ఫిష్ వంటి ఇతర రకాలతో పోలిస్తే ఇవీ అధిక శాతం ప్రోటీన్స్ కలిగి ఉంటాయి.ఈ సముద్ర దోసకాయల చర్మంలో ఫ్యూకోసిలేటెడ్ గ్లైకోసామినోగ్లైకాన్ అనే రసాయనం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ రసాయనంను ఆసియాలోని ప్రజలు కొన్ని శతాబ్దాలుగా బాధపడుతున్న ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. 

(చదవండి: సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్‌గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!)

ఇటీవల ఐరోపాలోని ప్రజలు కొన్ని క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీంతో రోజు రోజుకి సముద్ర దోసకాయ క్రేజ్ ఎక్కువగా పెరుగుతుంది. 1980లలో ఆహారం కోసం భారీగా డిమాండ్ వచ్చేది. అది ఇప్పుడు పాశ్చాత్య ఔషధ కంపెనీలకు ఔషదంగా పనిచేస్తుంది. మొరాకో నుంచి యునైటెడ్ స్టేట్స్, న్యూ గినియా వరకు సముద్ర దోసకాయలను ఎగుమతి చేస్తున్నాయి. సముద్ర దోసకాయలను ఎగుమతి చేసే దేశాల సంఖ్య 35 నుంచి 83కు పెరిగింది. వీటికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ జీవులలో కొన్ని జాతులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement