walking fish: నడిచే చేపల గురించి విన్నారా? | Walking Fish Story In Telugu, Fish That Can Survive And Move On Land | Sakshi
Sakshi News home page

Walking Fish Facts Telugu: నడిచే చేపల గురించి విన్నారా?

Published Sat, Sep 28 2024 1:35 PM | Last Updated on Sat, Sep 28 2024 3:55 PM

walking fish

వాటి కింద రుచి మొగ్గలు 

వాటి సాయంతో ఆహారం జాడ కనిపెడుతున్న సీ రాబిన్స్‌ 

 నూతన అధ్యయనంలో వెల్లడి 

సీ రాబిన్‌ చేపల్లో కొత్త రకం జాతుల వైవిధ్యమైన లక్షణాలను శాస్తవేత్తలు తాజాగా కనుగొన్నారు. సీ రాబిన్స్‌ చేపల్లోని ప్రియోనాటస్‌ కారోలైనస్‌ జాతుల మొప్పల వెనకాల రెక్కలతోపాటు, కిందిభాగంలో పీత ఉన్న మాదిరిగా ఆరు కాళ్లను గుర్తించారు. చేప ఈ కాళ్లతో ఎంచక్కా సముద్రగర్భం అడుగుభాగంపై చకచకా ముందుకు కదులుతోంది. ఆ కాళ్లకు మరో ప్రత్యేకత ఉంది. వాటి అడుగున ఉన్న పాదాల్లాంటి మెత్తని భాగానికి జ్ఞానేంద్రియంలాంటి గుణం ఉండటం విశేషం. సముద్రం అడుగున మట్టి కింద ఏదైనా చిన్న జీవి దాక్కున్నా, ఇంకేదైనా ఆహారం ఉన్నా ఈ చేప తన కాళ్లతోనే గుర్తించగలదు. 

అవసరమైతే మట్టిలో కూరుకుపోయిన ఆహారాన్ని తవ్వి బయటకు తీయగలదు. ఇలాంటి కొత్త విషయాలతో కూడిన అధ్యయన వివరాలు తాజాగా ‘కరెంట్‌ బయోలజీ’సైన్స్‌ జర్నల్‌లో గురువారం ప్రచురితమయ్యాయి. మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కల్గిన చిన్న జీవి జాడనూ చేప గుర్తించగలదు. అక్కడి ఆహారం, జీవి నుంచి విడుదలయ్యే రసాయనాలను గుర్తించే ఏర్పాట్లు సీ రాబిన్‌ పాదాల్లో ఉన్నాయి. పాదాల్లోని నరాలు ఇందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మనిషి నాలుక మీద ఉండే రుచి మొగ్గల లాంటి బొడిపెలు ఈ చేప పాదాల కింద ఉన్నాయి. వీటి సాయంతో అది తన ఆహారం జాడ కనిపెడుతోందని అధ్యయనం వెల్లడించింది.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement