
తిమింగలాన్ని సముద్రంలోకి తోస్తున్న అధికారులు, మత్స్యకారులు
భువనేశ్వర్ : 'సముద్రం ఒడ్డుకు గాయాలపాలైన ఓ భారీ తిమింగళం కొట్టుకు వచ్చిన ఘటన ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని గోపాలపూర్ తీరానికి ఆనుకుని ఉన్న సోన్‌పూర్ తీరానికి గురువారం 18 అడుగుల తిమింగలం కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొంతమంది మత్స్యకారులు గాయాలతో పడి ఉన్న ఆ తిమింగలాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గాయాలపాలైన తిమింగలానికి చికిత్స చేశారు. అనంతరం దానిని సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment