సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది. అన్నా చెల్లెలు గట్టు సమీపంలో 500 మీటర్లు ముందుకు వచ్చి, నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వెళ్లింది. సముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పౌర్ణమి పోటుతో అంతర్వేది బీచ్‌లో బుధవారం సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి. కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో అమావాస్య పోటుతో ఆరు రోజులు పాటు ఉగ్రరూపం దాల్చిన సముద్రం ప్రస్తుతం పౌర్ణమి పోటుకు అదే రీతిలో భయపెడుతోంది. కెరటాల ఉధృతికి ఇప్పటికే బీచ్ ఒడ్డున ఉన్న షాపులు ధ్వంసమయ్యాయి. అలాగే షాపులకు చేర్చి కట్టిన పెద్ద భవనం కూడా కోతకు గురవుతోంది. ఇదిలా ఉండగా, మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది.
ఇవీ చదవండి:
‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’
'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment