antarvedi Beach
-
విహార యాత్రలో విషాదం
మలికిపురం/సఖినేటిపల్లి: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో యువతి మృతదేహం లభ్యం కాగా, బాలుడి ఆచూకీ తెలియ రాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన సాలా ఏసురాజు నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 15 మంది బంధువులు శుక్రవారం అంతర్వేది సాగర సంగమం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. ఎగసి పడుతున్న సాగర కెరటాలను చూసిన ఉత్సాహంలో.. ఏసురాజు కుమారుడు రాజీవ్‌కుమార్ (5) పరుగు పరుగున అక్కడకు వెళ్లాడు. వేగంగా నీటిలో దిగడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన ఏసురాజు సోదరి, పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరుకు చెందిన బెల్లపుకొండ జ్యోతి (20) ఒక్క ఉదుటన పరుగెత్తుకుని వెళ్లి, ఆ బాలుడిని రక్షించబోయింది. ఈ క్రమంలో అలల ధృతికి ఆమె కూడా సముద్రంలోకి కొట్టుకుపోయింది. కాసేపటికి జ్యోతి మృతదేహం లభ్యమైంది. బాలుని ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. బంధుమిత్రులందరితో కలిసి సందడిగా గృహప్రవేశం చేసుకున్నామన్న ఆనందం ఆ కుటుంబానికి ఒక్క రోజు కూడా నిలవలేదు. కన్న కొడుకు గల్లంతవ్వడం, సోదరి జ్యోతి మృతి చెందడంతో ఏసురాజు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సఖినేటిపల్లి ఎస్సై ఎస్.రాము సందర్శించారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరం భిన్నమైన మార్పులను సంతరించుకుంటున్నది. గురువారం బీచ్‌లో సుమారు 200 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం, అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి సమారు కిలోమీటరు మేర లోపలికి వెళ్లింది. బీచ్‌లో అలల తీవ్రతతో సంద్రం ఉగ్రరూపంతోనూ, గోదావరి, సముద్రం కలిసే అన్నాచెల్లెలు గట్టు వద్ద సంద్రం తక్కువ అలల తీవ్రతతో ప్రశాంతంగా ఉంది. అన్నాచెల్లెలు గట్టు ప్రాంతంలో సముద్రం ఎంత ముందుకు వస్తుందో అంత వెనక్కి వెళ్లిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కనుచూపు మేర ఇక్కడ తీరం ఖాళీగా ఆటస్థలంగా కనిపిస్తున్నది. అమావాస్య, పౌర్ణమి ప్రభావాలతో ఆటు పోటులకు బీచ్ వద్ద ఒకలా, అన్నాచెల్లెలు గట్టు వద్ద మరొకలా ఎగసి పడుతున్న కెరటాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం వల్ల సముద్ర గర్భంలో వచ్చిన అలజడి ప్రభావమే ఇందుకు కారణమై ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బీచ్‌లో పరిస్థితులను తహసీల్దారు వై.రామకుమారి, మెరైన్ సీఐ బొక్కా పెద్దిరాజు, ఎస్ఐలు రవివర్మ, సోమశేఖర్‌రెడ్డి, సిబ్బంది బీచ్‌లో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి కిలోమీటరు లోపలికి వెళ్లిన సముద్రం ప్రమాదం ఏమీలేదు అంతర్వేది వద్ద సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ముంబై, గుజరాత్, గోవా వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అంతర్వేది విషయానికి వచ్చేసరికి సముద్రపు భూభాగం సమాంతరంగా (ఫ్లాట్‌గా) ఉండడమే కారణం. సగటున కేవలం 4 అడుగుల ఎత్తులో భూభాగం ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. – మురళీకృష్ణ, ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్, డైరెక్టర్, జేఎన్టీయూ కాకినాడ -
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది. అన్నా చెల్లెలు గట్టు సమీపంలో 500 మీటర్లు ముందుకు వచ్చి, నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వెళ్లింది. సముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పౌర్ణమి పోటుతో అంతర్వేది బీచ్‌లో బుధవారం సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి. కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో అమావాస్య పోటుతో ఆరు రోజులు పాటు ఉగ్రరూపం దాల్చిన సముద్రం ప్రస్తుతం పౌర్ణమి పోటుకు అదే రీతిలో భయపెడుతోంది. కెరటాల ఉధృతికి ఇప్పటికే బీచ్ ఒడ్డున ఉన్న షాపులు ధ్వంసమయ్యాయి. అలాగే షాపులకు చేర్చి కట్టిన పెద్ద భవనం కూడా కోతకు గురవుతోంది. ఇదిలా ఉండగా, మరోసారి సముద్రం వెనక్కి మళ్లింది. ఇవీ చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’ 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ -
రెండు రాత్రులు.. మూడు పగళ్లు నరక యాతన
► వేటకోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ► అంతర్వేది బీచ్ లో ఒడ్డుకు చేరుకున్న బాధితులు ► గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు అంతర్వేది (సఖినేటిపల్లి)/ రేపల్లె : రోను తుపాను ప్రభావంతో గతి తప్పిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బోటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బోల్తా పడింది. దానిలో ఉన్న ఒక వ్యక్తి గల్లంతవగా, మరో ఆరుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నిజాంపట్నం కేంద్రంగా బాలవర్థన్ అనే వ్యక్తికి చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంపై వేటకు వెళ్లారు. ఆ బోటులో కొత్తపాలేనికి చెందిన మత్స్యకారులు పుల్లంగుంట నాగమల్లేశ్వరరావు, కొప్పాడి రవి, పీతా వెంకటేశ్వరరావు, నీలం బాబూరావు, సున్నంపూడి మగదారయ్య, చెన్ను రవి, మన్నం ఏసోబు (65) ఉన్నారు. వీరంతా 18వ తేదీ రాత్రి రోను తుపానులో చిక్కుకున్నారు. లైటు వెలుతురు చూసి అప్రమత్తం.. ఇంజన్లో ఆయిల్ అడుగంటడంతో బోటు ఎటు వెళ్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వారంతా రెండు రాత్రులు, మూడు పగళ్లు సముద్రంపై నర కయాతన అనుభవించారు. ఆదివారం తెల్లవారుజామున ఎక్కడో దూరంగా మిణుకు మిణుకుమంటున్న లైటును గుర్తించి, ఆ దిశగా నెమ్మదిగా తెడ్లతో బోటును నెట్టుకుంటూ కొంత దూరం వచ్చారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంతర్వేది తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే ఉండిపోయారు. తమ దుస్థితిపై పడవలోని ఓ వ్యక్తి నిజాంపట్నం పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు సఖినేటిపల్లి ఎస్సై కృష్ణభగవాన్ బీచ్ వద్దకు చేరుకున్నారు. సముద్రంపై బోటు ఎక్కడ ఉన్నదీ గుర్తించడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. చివరికి ఒడ్డుకు.. నిజాంపట్నం పోర్టు అధికారులు సాంకేతిక సహాయంతో మత్స్యకారుల బోటును అంతర్వేది తీరం వైపు మళ్లించేలా చేశారు. దీంతో బోటును పోలీసులు గుర్తించారు. బోటులో ఉన్నవారి సెల్ నంబర్‌తో ఎస్సై సంప్రదింపులు జరుపుతూ, వారిని ఒడ్డుకు చేర్చేందుకు యత్నించారు. ఈ దశలో ఒడ్డుకు సమీపంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల మధ్య లంగ రు వేయడంతో అకస్మాత్తుగా బోటు తిరగబడిందని సున్నంపూడి మగదారియా చెప్పారు. దీంతో సముద్రంలోకి వెళ్లిన పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చారు. మన్నం ఏసోబు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సర్పంచ్‌లు భాస్కర్ల గణపతి, చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్‌లు వనమాలి మూలాస్వామి, నల్లి సుభాష్‌లు వారిని పరామర్శించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాచారంతో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు.