అథెన్స్: నడి సముద్రంలో పడిపోతే బయటకు రావటమన్నది దాదాపుగా అసాధ్యం. కానీ, సముద్రంలో పడిపోయిన ఓ వ‍్యక్తికి చిన్నారులు పడేసిన చిన్న బంతి వరంలా మారింది. బొమ్మ బంతి సాయంతో 18 గంటలు పోరాటం చేశాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. యూరప్‌లోని ఉత్తర మెసిడోనియాకు చెందిన ఇవాన్ అనే వ్యక్తి, అతడి సహచరుడు.. మైటీ బీచ్‌లో సేదతీరుతుండగా బలమైన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ పేర్కొంది.
కస్సాండ్రా మైటీ బీచ్ నుంచి 130 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఇవాన్.. ఓ చిన్న బంతి సాయంతో బయటపడినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఆ బంతిని ఇద్దరు బాలురు 10 రోజుల క్రితం సముద్రంలో పడేసుకున్నట్లు పేర్కొంది. 30 ఏళ్ల ఇవాన్ అలల్లో కొట్టుకుపోయిన క్రమంలో అతడి సహచరులు గ్రీక్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హెలికాప్టర్ సాయంతో సుమారు 18 గంటల తర్వాత కాపాడారు. ఆ తర్వాత గ్రీక్ మీడియాతో మాట్లాడారు ఇవాన్. తన వైపు వచ్చిన ఓ చిన్న బంతి సాయంతో ఊపిరి తీసుకుంటూ బలమైన అలలను తట్టుకుంటూ బయటపడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు.
మరోవైపు.. ఇవాన్ స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ ఆచూకీ ఇంకా లభించలేదని ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఇవాన్ బయటపడిన క్రమంలో ఓ మహిళ బంతి కోసం వచ్చారని, తన కుమారులు బీచ్‌లో పడేసుకున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఘటన అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇవాన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment