మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు.
‘కమ్యూనికేషన్ అర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ వియానాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు.
పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్‌కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు.
20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment