సర్ఫింగ్..సూపర్
అలలపై అలవోకగా తేలియాడే సర్ఫింగ్ బోర్డ్ మామూలుగా అయితే మీటరు సైజువి కూడా ఉంటాయి. కానీ దాదాపు 70 మంది ఎక్కగలిగే సర్పింగ్ బోర్డు ఇది. దీని పొడవు అక్షరాలా 42 అడుగులు. బరువు 500 కేజీలు. నూతన గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్ధలుకొట్టే పనిలోభాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఇంతటి భారీ బోర్డును తయారుచేశారు. ఒకేసారి 66 మంది ఇలా సర్ఫింగ్ చేసి రికార్డును తిరగరాయాలనేది వీరి కల.
కలను నిజం చేసుకునేందుకు శనివారం కాలిఫోర్నియాలోని హటింగ్టన్ బీచ్‌లో సర్ఫింగ్ చేశాక విజయగర్వంతో ఔత్సాహికులు తీరానికి తిరిగొస్తున్నపుడు తీసిందీ ఫొటో.