సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో కాలక్షేప మాధ్యమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఓటీటీ సంస్థలు పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పట్టికలో వేవ్స్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ప్రసార భారతి ఈ ఓటీటీని భారత్ నెట్‌వర్క్ సంస్థతో కలిసి ప్రారంభించింది. ఈ ఓటీటీలో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాత్, పంజాబీ, అస్సామీ తదితర 12 భాషలలో 10కి పైగా వివిధ రకాల ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయనుందని వేవ్స్ ఓటీటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.
వీటితోపాటు ఆకాశవాణి ప్రసారాలు, 65కు పైగా టీవీ ఛానళ్ల ప్రసార కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మంకీ కింగ్ హీరో, టాకీ అవెంజర్స్, చోటా భీమ్, తెనాలి రామన్, అక్బర్ బీర్బల్ తదితర సీరియళ్లు వేవ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయన్నారు. అలా అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించే ప్రసారాల్లో భాగంగా సంగీత, భక్తిరస కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment