akasavaani
-
12 భాషలలో 'ఓటీటీ ప్లాట్'ఫామ్‌ను ప్రకటించిన ప్రసార భారతి
సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో కాలక్షేప మాధ్యమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఓటీటీ సంస్థలు పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పట్టికలో వేవ్స్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ప్రసార భారతి ఈ ఓటీటీని భారత్ నెట్వర్క్ సంస్థతో కలిసి ప్రారంభించింది. ఈ ఓటీటీలో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాత్, పంజాబీ, అస్సామీ తదితర 12 భాషలలో 10కి పైగా వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయనుందని వేవ్స్ ఓటీటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆకాశవాణి ప్రసారాలు, 65కు పైగా టీవీ ఛానళ్ల ప్రసార కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మంకీ కింగ్ హీరో, టాకీ అవెంజర్స్, చోటా భీమ్, తెనాలి రామన్, అక్బర్ బీర్బల్ తదితర సీరియళ్లు వేవ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయన్నారు. అలా అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించే ప్రసారాల్లో భాగంగా సంగీత, భక్తిరస కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని నిర్వాహకులు తెలిపారు. -
దూరదర్శన్‌లో కాపీ ఎడిటర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ఆకాశవాణి-దూరదర్శన్ కేంద్రంలో కాంట్రాక్టు,పూర్తికాలపు ప్రాతిపదికన కాపీ ఎడిటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానించారు. ఆసక్తిగలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ప్రసార భారతి వెబ్సైట్ https://applications.prasarbharati.org ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.కాపీ ఎడిటర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయసు..జీత,భత్యాలు వంటి అదనపు సమాచారం కోసం ప్రసార భారతి వెబ్‌సైట్‌లోని ‘వేకెన్సీ’ https://prasarbharati.gov.in/pbvacancies/ విభాగంలో ఉన్న నోటిఫికేషనులో చూడొచ్చని ప్రసార భారతి తెలిపింది. -
కడప ఆకాశవాణికి మొబైల్ యాప్‌లో చోటు
సాక్షి, కడప : ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను ఇక మొబైల్ యాప్‌లో వినవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆకాశవాణి ప్రసారాలు వినేందుకు ప్రసార భారతి మొబైల్ యాప్‌ను రూపొందించింది. తొలి విడతగా ఈనెల 17న మన ఆకాశవాణి కడప కేంద్రం కంటే ఎంతో వెనుక ప్రారంభమైన రేడియో కేంద్రాలకు ఈ యాప్ సౌకర్యం కల్పించింది. ఆకాశవాణి కడప కేంద్రానికి ఈ సౌకర్యం కల్పించపోవడం గమనించిన జిల్లా సాహితీవేత్తలు, కళాకారులు ఆశ్చర్యపోయారు. ‘సాక్షి’ దినతిపత్రిక జిల్లా సంచికలో ఈనెల 18న ‘అయ్యో ఆకాశవాణి’ శీర్షికన ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రచురించింది. స్థానిక అధికారుల దృష్టి కి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు స్థానికుల నిరసనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మొబైల్ యాప్‌లో ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలకు కూడా చోటు కల్పించారు. ఈనెల 22వ తేది సాయంత్రం నుంచి ఈ ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు వింటున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినందుకు కడప శ్రోతలు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని కడప కేంద్రం ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా వినవచ్చు. యాప్ సౌకర్యం ఇలా గుగూల్ ప్లే స్టోర్‌లో న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారభారతి లైవ్ యాప్ అని టైప్ చేసి సెర్చి చేస్తే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్చేశాక స్క్రీన్ పైభాగాన కనిపించే రేడియోబొమ్మను క్లిక్ చేయాలి. అన్ని స్టేషన్ల ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిలో ఇష్టమైన కేంద్రాలను ఫేవరేట్ కేంద్రాలుగా ఒక క్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌తో తెలుగు వారు ఎక్కడున్నా మన కేంద్రం రేడియో ప్రసారాలను వినవచ్చు. అరచేతిలోని మొబైల్లో ఆకాశవాణి ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో వార్తలు, దూర దర్శన్ ఛానళ్ల కార్యక్రమాలను కూడా వినవచ్చు. -
ప్రముఖ రచయిత కన్నుమూత
-
తెలంగాణ, ఏపీలకు ఆకాశవాణి అవార్డులు
హైదరాబాద్ కేంద్రానికి 2, విశాఖ, విజయవాడకు ఒక్కొకటి సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణి 2014–15 వార్షిక అవార్డుల్లో తెలంగాణ, ఏపీలోని కేంద్రాలకు వివిధ విభాగాల్లో అవార్డు దక్కాయి. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో మూగజీవాలు ఏవిధంగా మమేకమై ఉంటాయన్న దానిపై నిర్మాత మురళీ కృష్ణ, రచయిత దుర్గయ్య, సహ రచయిత శివప్రసాద్‌లు చేసిన ‘గంగి రెద్దు’కార్యక్రమానికి రేడియే ప్లే విభాగంలో హైదరాబాద్ కేంద్రానికి మొదటి బహుమతి దక్కింది. ‘విశ్వగురు’కార్యక్రమానికి ఇన్నోవేటివ్ అవార్డు దక్కింది. మహిళా సాధికారతపై నిర్మాత కె.కామేశ్వర్రావు, రచయిత వి.ప్రతిమ తీసిన ‘గంగ జాతర’కు ఉత్తమ మహిళా కార్యక్రమం విభాగంలో విశాఖపట్నం కేంద్రా నికి అవార్డు దక్కింది. పారిశుధ్యంపై విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ‘బాపు బాటలో’కార్యక్రమానికి మరో అవార్డు దక్కింది. కేంద్ర మంత్రులు వెంకయ్య, రాజ్యవర్ధన్ రాథోడ్ శుక్రవారం ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.