తెలంగాణ, ఏపీలకు ఆకాశవాణి అవార్డులు | AP, Telangana conferred Akasavani awards | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీలకు ఆకాశవాణి అవార్డులు

Jun 17 2017 1:54 AM | Updated on Jun 2 2018 2:56 PM

ఆకాశవాణి 2014–15 వార్షిక అవార్డుల్లో తెలంగాణ, ఏపీలోని కేంద్రాలకు వివిధ విభాగాల్లో అవార్డు దక్కాయి.

హైదరాబాద్‌ కేంద్రానికి 2, విశాఖ, విజయవాడకు ఒక్కొకటి
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణి 2014–15 వార్షిక అవార్డుల్లో తెలంగాణ, ఏపీలోని కేంద్రాలకు వివిధ విభాగాల్లో అవార్డు దక్కాయి. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో మూగజీవాలు ఏవిధంగా మమేకమై ఉంటాయన్న దానిపై నిర్మాత మురళీ కృష్ణ, రచయిత దుర్గయ్య, సహ రచయిత శివప్రసాద్‌లు చేసిన ‘గంగి రెద్దు’కార్యక్రమానికి రేడియే ప్లే విభాగంలో హైదరాబాద్‌ కేంద్రానికి మొదటి బహుమతి దక్కింది. ‘విశ్వగురు’కార్యక్రమానికి ఇన్నోవేటివ్‌ అవార్డు దక్కింది.

మహిళా సాధికారతపై నిర్మాత కె.కామేశ్వర్‌రావు, రచయిత వి.ప్రతిమ తీసిన ‘గంగ జాతర’కు ఉత్తమ మహిళా కార్యక్రమం విభాగంలో విశాఖపట్నం కేంద్రా నికి అవార్డు దక్కింది. పారిశుధ్యంపై విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ‘బాపు బాటలో’కార్యక్రమానికి మరో అవార్డు దక్కింది. కేంద్ర మంత్రులు వెంకయ్య, రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ శుక్రవారం ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement