అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప | Dipa Karmakar most inspiring Indian woman: Survey | Sakshi
Sakshi News home page

అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప

Sep 3 2016 1:04 AM | Updated on Sep 4 2017 12:01 PM

అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప

అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప

రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత  స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది.

అయితే ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement