కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్ | 40-Year-Old Indian Woman Abducted From Kabul | Sakshi
Sakshi News home page

కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్

Published Fri, Jun 10 2016 11:00 AM | Last Updated on Mon, May 28 2018 1:37 PM

40-Year-Old Indian Woman Abducted From Kabul

కాబూల్: ఆప్ఘనిస్తాన్లోని కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ఆగా ఖాన్ ఫౌండేషన్లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్న కోల్కతాకు చెందిన జూడిత్ డిసౌజా(40)ను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి కిడ్నాప్ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాబూల్లోని టైమాని ఏరియాలో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది.

కిడ్నాప్కు గురైన మహిళ ఆచూకి కోసం ఆప్ఘన్ ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కిడ్నాప్ ఘటన తరువాత కొంత సమయం వరకు ఆమె ఫోన్ ఆన్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ ఆప్ఘన్ అధికారులను కోరింది. కిడ్నాప్కు పాల్పడింది ఉగ్రవాదులా లేక ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement