కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య | Indian Woman Student Shot In the Head in California's Albany | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య

Published Tue, Mar 17 2015 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య

లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలోని అల్బేనీలో ఉంటూ దంత విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ మహిళ(37) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిన గాయంతో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో విగత జీవిగా పడిఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్న రణధీర్ కౌర్ ఈ నెల 8న సాయంత్రం 4గంటలకు తన అపార్ట్మెంట్లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

ఆమె అప్పుడప్పుడు సిక్కు దేవాలయానికి వెళ్లి ప్రార్ధనలు చేస్తుంటుంది. అదే రోజు కూడా మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్లొచ్చిన అనంతరం ఈ ఘటన జరగడంతో రెండు గంటల వ్యవధిలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆ ఆపార్ట్మెంట్లోకి ఎవరు వచ్చి వెళ్లినట్లుగానీ, ఇంట్లో వాతావరణం చెడిపోయినట్లుగానీ ఆధారాలు లభించలేదు. ఆమె వ్యక్తిగత వస్తువులు పరిశీలించినా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరైన హత్య చేసి ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement