బెంగళూరు: బెంగళూరు నుంచి ఐస్‌లాండ్‌కు వెళ్తున్న భారతీయ మహిళ శ్రుతి బసప్పకు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. తనిఖీ చేసేందుకు దుస్తులు విప్పాలంటూ విమానాశ్రయ భద్రతా అధికారులు ఇబ్బంది పెట్టారని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు. ‘మొత్తం బాడీ స్కాన్ చేశాకకూడా సిబ్బంది సందేహం వ్యక్తం చేశారు. ‘దుస్తులు మొత్తం విప్పాలన్నారు.
చేతులతో తడిమి తనిఖీ చేసుకోమన్నాను. 2 వారాల క్రితం పొట్ట భాగంలో ఆపరేషన్ జరిగిందని, రికార్డుల్ని చూపించాను. దానికీ వారు ఒప్పుకోలేదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐస్‌ల్యాండ్ జాతీయుడైన తన భర్త గదిలోకి రాగానే అధికారుల తీరు పూర్తిగా మారిపోయిందని, చేతులతో తడిమి వదిలేశారన్నారు. ఇది స్పష్టంగా జాతి వివక్షేనని ఆమె వ్యాఖ్యానించారు.
జర్మనీలో భారతీయురాలికి చేదు అనుభవం
Published Sun, Apr 2 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
Advertisement
Advertisement