భారతీయుడిని రైలు పట్టాల పైకి తోసి చంపిన కేసులో 33 ఏళ్ల అమెరికా మహిళకు ఇక్కడి కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూయార్క్: భారతీయుడిని రైలు పట్టాల పైకి తోసి చంపిన కేసులో 33 ఏళ్ల అమెరికా మహిళకు ఇక్కడి కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మత విద్వేషంతో చేసిన ఈ నేరాన్ని ఎరికా మెనెండెజ్ అనే మహిళ క్వీన్స్ సుప్రీం కోర్టులో అంగీకరించింది. జడ్జి గ్రెగరీ లసక్ ఆమె చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. 2012 డిసెంబర్ 27న సునందో సేన్ (46) సబ్‌వే రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపైన ఉన్నప్పుడు వెనకవైపు నుంచి వచ్చిన మెనెండెజ్ రైలు సమీపిస్తుండగా అతడిని పట్టాలపైకి తోసేసింది.
తీవ్రగాయాలపాలైన సునందో సేన్ మరణించాడు. అనంతరం మెనెండెజ్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా తనకు ముస్లింలు, హిందువులంటే ద్వేషమని చెప్పింది. ‘ఇది దారుణ హత్య. మెనెండెజ్ చర్య న్యూయార్క్ నగరాన్ని మొత్తం వణికించింది. రోజూ లక్షలాది మంది కార్యాలయాలకు, స్కూళ్లకు, ఇతర గమ్యాలకు వెళ్లడానికి రైళ్లు ఎక్కుతుంటారు. ఇలాంటి ఘటనలు జరిగితే భద్రంగా ఉన్నామని ఎలా భావిస్తారు’ అని జడ్జి పేర్కొన్నారు.