వాషింగ్టన్ : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఐదుగురు భారతీయులను ఈ నెల 8న అక్కడి పోలీసులు వాషింగ్టన్ లోని మోల్సోన్ పంలో అరెస్ట్ చేశారు. వారికి సహకరించిన ఒక కెనడా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని ఇమిగ్రేషన్ జడ్జి ముందు హాజరుపరచనున్నట్లు బార్డర్ పోలీసు విభాగం తెలిపింది. ప్యూ సంస్థ నివేదిక ప్రకారం.. అక్రమంగా అమెరికాకు వలసవచ్చిన భారతీయుల సంఖ్య 2009లో 1.3 లక్షలు కాగా 2014నాటికి అది 5 లక్షలకు చేరింది. సంఖ్యాపరంగా చూస్తే అక్రమవలసదారుల్లో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నారు.