యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్‌లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్‌ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు.
బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్‌ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్‌ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్‌లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది.
(చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్‌ఐఐడీఎస్ సీరియస్!)
Comments
Please login to add a commentAdd a comment