వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది.
అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డుకు అర్హులవుతారు.
Comments
Please login to add a commentAdd a comment