2022కు హెచ్‌1బీ వీసా కోటా పూర్తి | US Immigration Body Says Visa Quota Reached H1B Cap For 2022 | Sakshi
Sakshi News home page

2022కు హెచ్‌1బీ వీసా కోటా పూర్తి

Published Wed, Mar 2 2022 10:02 AM | Last Updated on Wed, Mar 2 2022 10:02 AM

US Immigration Body Says Visa Quota Reached H1B Cap For 2022 - Sakshi

వాషింగ్టన్‌: ఈ సంవత్సరానికి హెచ్‌1బీ వీసా పరిమితి 65,000కు సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా మంగళవారం ప్రకటించింది. విదేశీ ఉద్యోగస్తులు అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కేటాయిస్తారు. టెక్‌ కంపెనీలకు ఈ వీసా చాలా అవసరం. అమెరికా చట్ట సభలు విధించిన ప్రకారం ఏటా 65వేల వరకు గరిష్టంగా ఈ వీసాలను కేటాయిస్తారు.

మరో 20వేల వీసాలను యూఎస్‌ అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ ఎగ్జెంషన్‌ కింద కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు సరిపడా దరఖాస్తులు తమకు ఇప్పటికే అందాయని యూఎస్‌ పౌర, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. ఈ వీసా దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర ప్రక్రియలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement