అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి.
ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది.
కొత్త నిబంధనల ప్రకారం..
గ్రేస్ పిరయడ్‌లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.
స్టేటస్ అప్లికేషన్‌ను అడ్జెస్ట్‌మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు.
ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment