పటాన్‌చెరు: బాలిక అత్యాచారం, ఆపై హత్యకు యత్నం వార్తలతో అమీన్‌పూర్‌లో కలకలం రేగింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు తనను అత్యాచారం చేసి హత్య చేసేం దుకు ప్రయత్నిస్తున్నారని ఓ బాలిక ఫోన్ లో తన తండ్రికి సమాచారం ఇచ్చింది. దాంతో ఆ బాలికను స్థానికులు కాపాడేందుకు వెళ్లగా దుండగులు పరారయ్యారు. అయితే తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన బాలిక కథనానికి భిన్నంగా పోలీసులు ఆమె పై అత్యాచారమే జరగలే దని తేల్చారు.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో వాణినగర్ లోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి వద్ద సదరు బాలిక తండ్రిగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆ బాలిక స్వస్థలమైన ఏపీలోని శ్రీకాకుళంలోనే ఉంటోంది. సెలవు లుండటంతో పది రోజుల క్రితమే తండ్రి వద్దకు వచ్చింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే బైక్‌పై వచ్చిన వ్యక్తి తనను బెదిరించి నిర్మానుష్య ప్రాం తానికి తీసుకెళ్లగా.. ఆ తర్వా త మరో ముగ్గురు కారులో వచ్చి తనపై లైంగి కదాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఈలోగా తన ఫోన్ నుంచి తండ్రికి సమాచారమివ్వగా అందరితో వచ్చి కాపాడారని వెల్లడించింది.
అత్యాచారం జరగలేదు: ఎస్పీ
దీనిపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల తర్వా త బాలికపై అత్యాచారం జరగదలేని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. బైక్‌పై ఎం దుకు వెళ్లావని ప్రశ్నిస్తే.. అతను ముందే తెలుసని.. తన నగ్న చిత్రాలు ఫోన్‌లో ఉన్నాయని బెదిరించి వాహనంపై తీసుకెళ్లాడని ఆమె చెప్పిందన్నారు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తరలించిన నిందితులను పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
బాలిక కిడ్నాప్.. అత్యాచారం
టేక్మాల్(మెదక్): బాలికను అపహరించుకుపోయి అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. అల్లాదుర్గం సీఐ రవి కథనం ప్రకారం.. టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన బాలిక (15) సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 18న నానమ్మతో కలసి మధ్యాహ్నం చేనుకి వెళ్లింది. ఇద్దరూ కలసి పని చేస్తుండగా నీళ్లు తాగుతానంటూ ఆ బాలిక చేను వద్ద ఉన్న గుడిసెలోకి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఈనెల 21 పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరపగా అదే గ్రామానికి చెందిన పిట్ల లక్ష్మణ్ (23) బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో ఉండే లక్ష్మణ్ బంధువు మల్లయ్య ఇంట్లో బాలికను ఉంచినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం పోలీసులు మిన్పూర్‌కు వెళ్లి వారిని పట్టుకున్నారు. లక్ష్మణ్, మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment