విహారయాత్రలో విషాదం... | Three from Karnataka drowned in sea | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం...

Published Sat, May 2 2015 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

కర్ణాటక నుండి కేరళకు విహారయాత్రకు బయలుదేరిన బృందం విషాదంలో మునిగిపోయింది. తమ బృందంలో ముగ్గురు నదిలో స్నానానికి దిగి మృతి చెందడంతో వారు దిగ్భాంతికి లోనయ్యారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విషాదం. ఇద్దరు తండ్రీ కొడుకులు కాగా మరొకరు దగ్గరి బంధువు.

ఖాజీకోడ్:  కర్ణాటక నుండి  కేరళకు విహారయాత్రకు బయలుదేరిన బృందానికి విషాదమే మిగిలింది.  బృందంలో ముగ్గురు  నదిలో స్నానానికి దిగి  ప్రాణాలు కోల్పోవడంతో  వారు దిగ్భాంతికి లోనయ్యారు. కాగా   చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విషాదం. మృతుల్లో ఇద్దరు తండ్రీ కొడుకులు కాగా  మరొకరు దగ్గరి బంధువు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  కర్ణాటకు చెందిన సుమారు పదిహేనుమంది   కేరళ పర్యటనకు  బయలుదేరారు. మధ్యలో ఖాజీకోడ్ సమీపంలోని కప్పాడ  బీచ్లో ఆగారు.  వీరిలో ఇందూధర్, వెంకటనారాయణ,  వెంకటేష్ అనే ముగ్గరు స్నానానికి  నదిలో దిగారు.  అకస్మాత్తుగా నదిలో మునిగిపోతూ కేకలు వేయడం ప్రారంభించారు. వీరి అరుపులు వున్న స్థానికులు, మత్స్యకారులు  వారిని ఒడ్డుకు  చేర్చినా ఫలితం దక్కలేదు.  హుటాహటిన వారిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement