Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian Strikes In Pakistan Kill Jaish Chief Masood Azhar 10 Family Members And 4 Close Aides1
ఆపరేషన్‌ సిందూర్‌.. మసూద్‌ అజర్‌ ఫ్యామిలీ ఖతం

ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్‌ లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.ముఖ్యంగా బవహల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్‌ శిబిరాలు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నట్లు సమాచారం.

Who Are Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh2
Operation Sindoor: ఎవరీ కల్నల్‌ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్‌ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్‌ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్‌ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్‌ హోదాలో ఆపరేషన్‌ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్‌ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్‌సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.

Ys Jagan Discusses Operation Sindoor With Ysrcp Leaders3
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్‌ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

YSRCP Leaders Given Two Lacks To simhachalam victims4
సింహాచలం బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ.. రెండు లక్షలు అందజేత

సాక్షి, విశాఖ: సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ తరఫున బాధితులకు రెండు లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మజ్జి చిన్న శ్రీను, కేకే రాజు.. రెండు లక్షలు అందజేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి ఏడుగురి ప్రాణాలు తీశారు. దేవాలయాలకు వెళ్లలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు తీసుకువచ్చారు. కూటమి పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Indian Army Operation Sindoor POK Over Pahalgam Live Updates5
ఆపరేషన్‌ సిందూర్‌ అప్‌డేట్స్‌.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం

Indian Army Operation Sindoor Updates.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యవసర సమీక్షసరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు హాజరువీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షజమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు, లడఖ్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ హాజరు రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశంవివరాలు వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజురేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుఆపరేషన్ సిందూర్ వివరాలు అఖిలపక్షానికి వివరించనున్న కేంద్రంభారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు వివరించనున్న కేంద్రం ముగిసిన కేబినెట్ సమావేశం..పాక్‌ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ గురించి కేబినెట్‌ సహచరులకు వివరించిన ప్రధానికేబినెట్‌లో భద్రతా బలగాలను కీర్తించిన ప్రధాని మోదీరాష్ట్రపతి నిలయానికి ప్రధాని మోదీ.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించనున్న ప్రధాని. ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయిన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ #WATCH | Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah leave from 7, LKM, the official residence of PM Modi pic.twitter.com/U0rmI5nkEC— ANI (@ANI) May 7, 2025 మోదీ విదేశీ పర్యటనలు రద్దు.. మీడియా సమావేశం..ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.మూడు దేశాల పర్యటన రద్దు అయ్యింది.నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్‌ పర్యటన రద్దుప్రధాని మోదీ మీడియా సమావేశం..భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోంది.అంతరిక్ష ప్రయోగాలపై మోదీ సందేశం.అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం. కేంద్ర కేబినెట్‌ భేటీ..కొనసాగుతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంఆపరేషన్ సిందూర్‌పై చర్చిస్తున్న కేబినెట్‌సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులపై సమీక్ష‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రపంచ నేతల స్పందన ఇదే..👉అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్‌, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు.👉అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందన.. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి👉భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌.. ఆత్మ రక్షణ కోసం భారత్‌ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది.👉యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌.. భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి👉చైనా స్పందన.. భారత్‌, పాక్‌ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్‌, పాకిస్థాన్‌లను కోరుతున్నాం👉ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌.. రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలి. పౌరులను చంపడం భావ్యం కాదు: ఒమర్‌ అబ్దుల్లాపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత బలగాలుపాక్‌ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడిఅయినప్పటికీ పాక్‌ అన్యాయంగా పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని విమర్శ.అమిత్‌ షా కీలక ఆదేశాలు..సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండిఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాసెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్న అమిత్ షా ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా సమావేశం ప్రారంభంమీడియా సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్‌ షాభారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాయని వెల్లడిఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టిన అమిత్ షాజమ్ముకశ్మీర్‌ సీఎంతో మాట్లాడిన అమిత్‌ షాఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత స్పందిస్తున్న కేంద్ర పెద్దలు..ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, బీఎస్‌ఎఫ్‌ డీజీతోనూ చర్చించిన అమిత్‌ షాసరిహద్దు భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్షపౌరుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎంఅత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశంజేపీ నడ్డా వార్నింగ్‌..మా జోలికొస్తే ఊరుకుంటామా అంటూ నడ్డా వ్యాఖ్యలు..ఆపరేషన్‌ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయి.భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నడ్డాఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని పోస్టు పెట్టిన నడ్డారక్షణ మంత్రితో సీడీఎస్‌ భేటీరక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌సౌత్ బ్లాక్‌లో పరిస్థితిని వివరిస్తున్న అనిల్‌ చౌహాన్‌ త్రివిధ దళాల మీడియా సమావేశం..ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశంసమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులుఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.పాకిస్తాన్‌, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరంభారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది. India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK. We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage. Since the day of the…— Mallikarjun Kharge (@kharge) May 7, 2025ఆపరేషన్‌ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాంఈ సమయంలో మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!#ఆపరేషన్ సిందూర్As an Indian citizen first, standing strongly with our armed forces. The strikes against terror factories in Pakistan & PoK make us proud. Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!#OperationSindoor— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025 భారత్‌కు ఇజ్రాయెల్‌ మద్దతు..ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారిఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్‌ అజర్‌అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌భారత్‌ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్‌ ఒవైసీ ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాంపహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారుపాకిస్తాన్‌ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్‌ मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ గాంధీ స్పందన ఇదే..ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ పోస్ట్‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్‌’ Proud of our Armed Forces. Jai Hind!— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యంసైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్‌ పోస్ట్ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలుసరిహద్దుల నుంచే దాడులు.. ఆపరేషన్‌ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశంభారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులుఆపరేషన్‌ సిందూర్‌.. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్త ఆపరేషన్‌ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలుఇంటెలిజెన్స్‌ వర్గాల సహకారంతో దాడిభారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్‌..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీభారత్‌ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్‌ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్‌పూర్‌, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్‌ దాడుల్లో పాక్‌ ఆర్మీ ఐఎస్‌ఐ కంట్రోల్‌ రూమ్‌ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్‌ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్‌ డిఫెన్స్‌ వ్యవస్థలుభారత్‌ దాడులతో పాక్‌ అప్రమత్తమైంది.లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్‌ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్‌ జెట్‌ధర్మశాల, లేహ్‌, జమ్మూ, అమృత్‌సర్‌ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్‌ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్‌ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్‌ టు సర్ఫేస్‌’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని నామకరణం చేశారు. మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్‌ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన రాజ్‌నాద్‌ సింగ్‌. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.భారత్‌ తడాఖా.. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ విలవిల (ఫొటోలు)👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

operation sindoor fighter jet specialities6
ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్‌ జెట్‌లు

పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ మెరుపుదాడికి పాల్పడింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆ‍ర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్‌, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్‌డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్‌ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్‌బీఈ2 ఏఈఎస్‌ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్‌ను అమర్చారు. రెండు ఎస్‌ఎన్‌సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్‌లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్‌ పైలట్‌లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్‌లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్‌-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్‌ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్‌-31FP టర్బోఫాన్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్ అండ్‌ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్‌లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్‌, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు.

BCCI Punishes Hardik Pandya And Entire MI XI, Fines Ashish Nehra Also Details7
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!.. ఆశిష్‌ నెహ్రానూ వదల్లేదు

ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌ (MI Vs GT)తో తలపడింది.ప్లే ఆఫ్స్‌ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్‌ సేన పరిమితమైంది.గెలిచిన గుజరాత్‌ఇక గుజరాత్‌ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్‌ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.రూ. 24 లక్షల ఫైన్‌ఈ సీజన్‌లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్‌కు రూ. 24 లక్షల ఫైన్‌ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్‌ ప్లేయర్‌ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు​ ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది.ఆశిష్‌ నెహ్రాను వదల్లేదుఈ మేరకు.. ‘‘ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్‌ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.ఐపీఎల్‌ నియమావళిలోని ఆర్టికల్‌ 2.20 ప్రకారం ఆశిష్‌ నెహ్రా లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్‌ టైమింగ్‌ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.ఐపీఎల్‌-2025: ముంబై వర్సెస్‌ గుజరాత్‌👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్‌: గుజరాత్‌.. తొలుత బౌలింగ్‌👉ముంబై స్కోరు: 155/8 (20)👉గుజరాత్‌ స్కోరు: 147/7 (19)👉ఫలితం: డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌ గెలుపుచదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025

indian Army press conference on Operation Sindoor8
Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌.. లైవ్‌

ఢిల్లీ: పాక్‌ ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్‌ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్‌ మీట్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్‌ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్‌ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌..👉ఇండియన్‌ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్‌ సిందూర్‌ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్‌లో ఉన్న టెర్రర్‌ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్‌ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్‌ కసబ్‌కూడా ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచారంతో దాడులు చేశాం 👉విక్రమ్‌ మిస్రీఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్‌ఎఫ్‌కు పాకిస్తాన్‌ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్‌..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్‌లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్‌పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్‌ షెల్టర్‌ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 22, 2025న, పాకిస్తాన్,పాకిస్తాన్ శిక్షణ పొందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై దారుణమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఒక నేపాల్ జాతీయుడు కూడా ఉన్నారు. 2008 నవంబర్ 26 ముంబై దాడుల తర్వాత ఇది అత్యధిక పౌర మరణాలతో కూడిన ఉగ్రదాడి. దాడి అత్యంత క్రూరంగా జరిగింది, బాధితులను సమీప నుండి తలపై కాల్చి చంపారు, వారి కుటుంబాల ముందే ఈ హత్యలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా హత్యలు జరిగాయి, సందేశాన్ని తీసుకెళ్లమని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్‌లో తిరిగి వస్తున్న సాధారణ స్థితిని అడ్డుకోవడం ఈ దాడి లక్ష్యం. గత సంవత్సరం 23 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించిన ఈ ప్రాంతంలో పర్యాటక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని ఉద్దేశం. ఈ దాడి యూనియన్ టెరిటరీలో వృద్ధిని అడ్డుకుని, పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో జరిగింది. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టే ఉద్దేశంతో జరిగింది.భారత ప్రభుత్వం,ప్రజలు ఈ కుట్రలను విఫలం చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ” (TRF) అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్‌ఎఫ్‌ అనేది ఐక్యరాష్ట్ర సమితి నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు. మే, నవంబర్ 2024లో ఐక్యరాష్ట్ర సమితి 1267 శిక్షణ కమిటీకి భారత్ TRF గురించి సమాచారం అందించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు కవర్‌గా పనిచేస్తుందని తెలిపింది. డిసెంబర్ 2023లో లష్కర్, జైష్-ఎ-మహమ్మద్ టీఆర్‌ఎఫ్‌ టి చిన్న ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఏప్రిల్ 25, 2025 ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి పత్రికా ప్రకటనలో TRF ప్రస్తావనను తొలగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేసింది పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. TRF చేసిన బాధ్యత ప్రకటనలు, లష్కర్-ఎ-తోయిబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని రీపోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. సాక్షుల గుర్తింపు, చట్ట అమలు సంస్థలకు అందిన సమాచారం ఆధారంగా దాడి చేసినవారిని గుర్తించారు. ఈ దాడి ప్రణాళికకర్తలు, మద్దతుదారుల గురించి భారత ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం సేకరించింది. భారత్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చరిత్ర బాగా డాక్యుమెంట్ చేయబడింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరుగాంచింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది. సజిద్ మీర్ కేసు దీనికి ఉదాహరణ: ఈ ఉగ్రవాదిని మృతుడిగా ప్రకటించి, అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత అతను బతికే ఉన్నాడని, అరెస్టు చేశామని తెలిపారు.పహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఏప్రిల్ 23న పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాథమిక చర్యలను ప్రకటించింది. దాడి జరిగిన రెండు వారాలు గడిచినప్పటికీ, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం ఆరోపణలు, తిరస్కరణలతో సరిపెట్టింది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గుండ్లు మరిన్ని దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది.ఆపరేషన్ సిందూర్: ఈ ఉదయం భారత్ తన హక్కును వినియోగించుకుని, సరిహద్దు దాడులను నిరోధించడానికి, నివారించడానికి చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నియంత్రిత, అనవసర ఉద్రిక్తత లేని, సమతూకమైన, బాధ్యతాయుతమైనవి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, భారత్‌కు పంపబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంపై దృష్టి సారించారు. ఏప్రిల్ 25, 2025న ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి జారీ చేసిన పత్రికా ప్రకటనలో “ఈ దుర్మార్గపు ఉగ్రవాద చర్యకు కారకులు, నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులను జవాబుదారీగా చేసి న్యాయస్థానం ముందు తీసుకురావాలి’ అని నొక్కి చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీవింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్‌ సిందూర్‌లో ఇండియన్‌ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్‌ ఉగ్రవాద ట్రైనింగ్‌ సెంటర్లు ఇవే ఎల్‌ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్‌ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్‌ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ - హెచ్‌ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్‌ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్‌ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్‌ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025

Tadipatri SP Jagadeesh Over Action9
తాడిపత్రిలో టెన్షన్‌.. ఎస్పీ జగదీష్‌ తీరుపై చర్చ

సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్‌ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్‌ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది.

how operation sindoor impacts indian stock market for short time10
ఆపరేషన్‌ సిందూర్‌.. స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్‌ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్‌ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్‌ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్‌ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్‌ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్‌ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్‌ సెషన్‌ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్‌లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement