వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
Published Thu, Sep 8 2016 12:49 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
గణపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్‌పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సమ్మయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా తాగొచ్చి భార్యతో గొడవపడి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా బుధవారం పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమారులు ఉం డగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఉన్నారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నపెండ్యాలలో ఉపాధ్యాయురాలు..
చిన్నపెండ్యాల(స్టేçÙన్‌ఘన్‌పూర్) : భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిన్నపెండ్యాలలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఘన్‌పూర్‌కు చెదిన గుంటి లింగయ్య, ఎల్లమ్మ దంపతుల కూతురు రజిత(25)కు మండలంలోని చిన్నపెండ్యాలకు చెందిన బుల్లె అయిలయ్య, ఐలమ్మ దంపతుల కుమారుడు రవితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. ప్రతీ రోజు ఏదో ఒక విధంగా వేధిస్తుండడంతో రజిత అదే గ్రామంలోని శ్రీగాయత్రి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అయినా రాత్రి వేళలో వేధించేవాడు. దీంతో మనోవేదనకు గురైన రజిత మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందుతాగింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శంకరాజుపల్లిలో వృద్ధురాలు..
ఏటూరునాగారం : వృద్ధాప్యంలో తనను చూసుకునేవారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని శంకరాజుపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గోనె సమ్మక్క(90) కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఆలనపాలన చూసే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుం ది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
Advertisement