బంజారాహిల్స్లో సైకోదాడి: ఒకరి మృతి | Three persons attacked by unknown persons in banjara hills road number 12 | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో సైకోదాడి: ఒకరి మృతి

Published Wed, Oct 7 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

బంజారాహిల్స్లో సైకోదాడి: ఒకరి మృతి

బంజారాహిల్స్లో సైకోదాడి: ఒకరి మృతి

హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ - 12 ఎన్బీటీ నగర్లో రహదారిపై వెళ్తున్న ఐదుగురు వ్యక్తులను ఓ సైకో అడ్డగించి... కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ఈ సంఘటనలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బబ్లూ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ఆసుపత్రికి చేరుకొని  దాడి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement