మరో మెగా రీమేక్ | allu sirish planing for yaamirukka bayamey remake | Sakshi
Sakshi News home page

మరో మెగా రీమేక్

Published Tue, Oct 13 2015 12:10 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

మరో మెగా రీమేక్

మరో మెగా రీమేక్

భారీ బ్యాక్గ్రౌండ్తో ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న మెగా వారసుడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తొలి సినిమాతో చేదు అనుభవాన్నే మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా నటన పరంగా ఏ మాత్రం ఆకట్టుకోవలేకపోవటంతో విమర్శలు ఎదుర్కొవలసి వచ్చింది.

ఆ తరువాత రూటు మార్చి కమర్షియల్ జానర్లో రెజీనాతో కలిసి 'కొత్త జంట' సినిమా చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శిరీష్.

కోలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'యామురిక్క భయమెయ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన డికే దర్శకత్వంలోనే చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి శిరిష్ రీమేక్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement