మెగా హీరో వరుణ్ తేజ్ రెండో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమాతో సాఫ్ట్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ రెండో సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాడు. అందుకే గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాతో వరుణ్ ను యాక్షన్ హీరోగా పరిచయం చేస్తున్నాడు. వరుణ్ హీరోగా చేస్తున్ రెండో సినిమా'కంచె' టీజర్ మంగళవారం విడుదలైంది.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న 'కంచె' సినిమాలో యుద్ధ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సీన్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయని చెపుతున్నారు. ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు ( సెప్టెంబర్ 1)న విడుదల చేశారు.
వరుణ్ సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమికుడిగా, సైనికుడిగా.. వరుణ్
Published Tue, Sep 1 2015 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement
Advertisement