సేమ్ టీమ్‌తో మరో సినిమా | Kalyana Vaibhogame Platinum Disc Function | Sakshi
Sakshi News home page

సేమ్ టీమ్‌తో మరో సినిమా

Published Tue, Mar 8 2016 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

సేమ్ టీమ్‌తో మరో సినిమా

సేమ్ టీమ్‌తో మరో సినిమా

- నిర్మాత దామోదర్‌ప్రసాద్
 ‘‘నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. నాగశౌర్య, మాళవికా నాయర్, సాయి రిత్విక్ 100 శాతం వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇండస్ట్రీలో నన్ను ఎవరూ నమ్మనప్పుడు దామోదర్‌గారు నమ్మి ఈ చిత్రం తీశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టినందుకు గర్వంగా ఉంది. మా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ ఇటీవల విడుదలైంది.
 
 ఈ చిత్రం ప్లాటినమ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘ఈ టీమ్ నా ఫ్యామిలీ లాంటిది. ‘అలా మొదలైంది’ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌లో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. ఇదే టీమ్‌తో త్వరలో మరో సినిమా చేస్తా’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ఈ చిత్రంలోని పెళ్లి పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా పెళ్లిలో అదే పాట పెట్టుకుంటా. ఇప్పటి దాకా 8 చిత్రాలు చేసినా దేనికీ రాని ప్రశంసలు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది’’ అని నాగశౌర్య చెప్పారు. సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమేరామ్యాన్ జివిఎస్ రాజు, రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement